Second Coming

ప్రభుని రాకడ ఈ దినమే

Prabhuni Raakada Ee Diname

Watch on YouTube
ప్రభుని రాకడ - ఈ దినమే పరుగులిడి రండి - సుదినమే (2) పరమునందుండి - మన ప్రభువు ధరకు నరుగును - పాలనకై (2) బూరశబ్దముతో - జనులారా ||ప్రభుని|| సిద్ధులగు వారిన్ - మన యేసు శుద్ధి జేయునిలన్ - పరమునకై (2) బుద్ధిహీనులను - శ్రమలచేత బద్ధులుగ జేయున్ - వేదనతో (2) బాధ కలిగించున్ - సాతాను ||ప్రభుని|| స్వరముతో వచ్చున్ - అధికారి మహిమతో మరలున్ - తన దూత (2) సూర్యచంద్రునిలన్ - తారలతో జీకటుల్ క్రమ్మున్ - ప్రభు రాక (2) పగలు రాత్రియగున్ - త్వరపడుము ||ప్రభుని|| మొదట లేతురు - సజీవులై ప్రభునియందుండు - ఆ మృతులు (2) మరల అందరము - ఆ ధ్వనితో పరము జేరుదుము - ధరనుండి (2) ధన్యులగుదుము - పరికించు ||ప్రభుని|| వెయ్యియేండ్లు - పాలించెదరు ప్రియుని రాజ్యమున - ప్రియులు (2) సాయం సమయమున - చేరి నెమలి కోకిలలు - రాజున్ (2) పాడి స్తుతించును - ఆ దినము ||ప్రభుని|| గొర్రె మేకలును - ఆ చిరుత సింహజాతులును - ఒక చోట (2) భేధము లేక - బరుండి గరిక మేయును - ఆ వేళ (2) కలసి మెలగును - భయపడక ||ప్రభుని|| న్యాయ నీతులన్ - మన ప్రభువు ఖాయముగ దెల్పున్ - ఆనాడు (2) సాక్షులుగ నిలుతుం - అందరము స్వామియేసునకు - ధ్వజమెత్తి (2) చాటి యేసునకు - ఓ ప్రియుడా ||ప్రభుని||