Worship

పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు

Parishuddhudavai Mahima Prabhaavamulaku Neeve Paathrudavu

Watch on YouTube
పరిశుద్ధుడవై - మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై - దీనుల పక్షమై కృప చూపు వాడవు (2) దయాళుడవై - ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడవై|| నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2) శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన|| నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి (2) నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి ||ఆరాధన|| ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి (2) మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు ||ఆరాధన||