పరిశుద్ధుడా నా యేసయ్యా - నిన్నే స్తోత్రింతును
మహోన్నతుడా నా తండ్రి - నిన్నే ఘనపరతును
ప్రభువా పూజార్హుడా - మహిమ సంపన్నుడా
యెహోవా విమోచకూడా - ఆశ్రయ దుర్గమా (2)
అభిషిక్తుడా ఆరాధ్యుడా - నిన్నే ప్రేమింతును
పదివేలలో అతిసుందరుడా - నీలోనే హర్షింతునూ
రాజా నా సర్వమా - నీకే స్తుతికీర్తనా
నీతో సహవాసము - నిత్యం సంతోషమే (2)
||పరిశుద్ధుడా||
