పరలోకమే నా స్వాస్థ్యము
ఎపుడు గాంతునో (2)
నా ప్రియ యేసుని
నేనెపుడు గాంతునో (2)
||పరలోకమే||
ఆకలిదప్పులు దుఃఖము
మనోవేదన లేదచ్చట (2)
పరమ మకుటము పొందను
ప్రభు పాదముల చేరెదను (2)
||పరలోకమే||
సిలువ వేయబడితిని
ఇక నేకాదు జీవించుట (2)
ప్రభు యేసు మహిమ కొరకు
గురి గలిగి జీవింతును (2)
||పరలోకమే||
నా పరుగు తుద ముట్టింప
నాకు కృపను మెండుగ నొసగును (2)
విశ్వాస మార్గములో
విసుగక పరుగెత్తెదను (2)
||పరలోకమే||
పరమ విశ్రాంతి పొంద
పరలోకమందు చేరెదను (2)
పగలు రాత్రచ్చట లేదు
ప్రభువే దీపమై యుండును (2)
||పరలోకమే||
ప్రియుని పిలుపును విని
నేను కూడా సిద్ధపడెదను (2)
దినములు సమీపించగా
వాంఛయు అధికంబాయె (2)
||పరలోకమే||
