పరలోకమే నా అంతఃపురం
చేరాలనే నా తాపత్రయం (2)
యేసుదేవరా - కనికరించవా - దారి చూపవా (2)
||పరలోకమే||
స్వల్ప కాలమే ఈ లోక జీవితం
నా భవ్య జీవితం మహోజ్వలం (2)
మజిలీలు దాటే మనోబలం
నీ మహిమ చూసే మధుర క్షణం (2)
వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం - నాకు ఈయవా (2)
||పరలోకమే||
పాపము నెదిరించే శక్తిని నాకివ్వు
పరులను ప్రేమించే మనసే నాకివ్వు (2)
ఉద్రేక పరచే దురాత్మను
ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2)
మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం - నాకు నేర్పవా (2)
||పరలోకమే||
