Worship

ఒక క్షణమైనా నిన్ను వీడి ఉండలేనయ్య నా యేసయ్యా

Oka Kshanamaina Ninnu Veedi Undalenayya Naa Yesayyaa

Watch on YouTube
ఒక క్షణమైనా నిన్ను వీడి ఉండలేనయ్య నా యేసయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక క్షణమైనా|| నశియించిపోతున్న నన్ను బ్రతికించినావయ్యా యేసు కృశించిపోతున్న నాలో వేంచేసినావయ్యా యేసు (2) నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా ||యేసయ్యా|| మతిలేక తిరిగిన నన్ను నీ దరి చేర్చినావయ్యా యేసు శ్రమ చేత నలిగిన నాకు వరమిచ్చినావయ్యా యేసు (2) నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా ||యేసయ్యా||