నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము
నన్ను కలిసిన వరము (2)
స్తుతి గాన సంపద నిన్ను చేరాలని
నా దీన మనస్సు నీవే చూడాలని
ప్రయాసతో ప్రయాణమైతిని
||నీవే||
నీ తోడు నాకుండగా - ఏ దిగులు నాకుండదు
నీ చెలిమి నాకుండగా - కన్నీరే నాకుండదు (2)
ప్రతి కీడు తప్పించు - పరిశుద్ధ గ్రంథం
నా కొరకే పంపావయ్యా
ఏ చోటనైనా - ఏ పల్లెనైనా
నీ పలుకే బంగారమాయెనయా
||నీవే||
నోవాహును నడిపిన - నావికుడు నీవేనయ్యా
సంద్రాన్ని చల్లార్చిన - ఆ శక్తి నీదేనయ్యా (2)
దావీదు ప్రార్ధన - ఆ యోబు వేదన
కనిపెట్టి చూసావయ్యా
నా దుఃఖ భారం - నా శాప భారం
నీలోనే కరగాలయ్యా
||నీవే||
