Repentance

నీవే నీవే కావాలి ప్రభువుకు

Neeve Neeve Kaavaali Prabhuvuku

Watch on YouTube
నీవే నీవే కావాలి ప్రభువుకు నేడే నేడే చేరాలి ప్రభువును (2) ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే|| నీ సృష్టికర్తను నీవు విడచినా నీకిష్టమైన రీతి నీవు నడచినా (2) దోషివయినా ద్రోహివయినా దేవుని చెంత - చేరిపుడైనా (2) ||ఈ కాలం|| పాపాలతో నీవు పండిపోయినా ప్రేమించువారు లేక కృంగిపోయినా (2) యేసుని చరణం - పాప హరణం యేసుని స్నేహం - పాపికి మోక్షం (2) ||ఈ కాలం|| నీటి బుడగలాంటిది నీ జీవితం గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2) అధికుడవైనా అధముడవైనా ఆయన ప్రేమ - కోరిపుడైనా (2) ||ఈ కాలం||