Good Friday

నీలాంటి ప్రేమ ఈ లోకాన

Neelaanti Prema Ee Lokaana

Watch on YouTube
నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? - (2) నా పాపభారం ఆ సిలువపైన ఎవరైనా మోశారా? - (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. ఓ యేసయ్యా (2) ||నీలాంటి|| చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిసయ్యులే నిన్ను పరిహసించగా (2) నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా|| దొంగలే నిన్ను దూషించగను నా అనువారే అపహసించగా (2) నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా|| తండ్రి వీరు చేయునదేమో ఎరుగరు కనుక క్షమియించుమని (2) ప్రార్ధన చేసితివయ్యా మము క్షమియించితివయ్యా (2) ||యేసయ్యా|| నీ దివ్య ప్రేమను ప్రకటింతునయ్యా ఆ ప్రేమ మార్గములో నడిచెదనయ్యా (2) నీదు ప్రేమే నా గానం నీ ప్రేమే నా భాగ్యం (2) ||యేసయ్యా||