నీ ప్రేమ నా జీవితాన్ని - నీకై వెలిగించెనే యేసయ్యా
నీ కృప సెలయేరులా - నాలో ప్రవహించెనే (2)
నన్ను క్షమియించెనే - నన్ను కరుణించెనే
నన్ను స్థిరపరచెనే - నన్ను ఘనపరచెనే (2)
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2)
నేను నిన్ను విడచిననూ - నీవు నన్ను విడువలేదయ్యా
దారి తప్పి తొలగిననూ - నీ దారిలో నను చేర్చినావయ్యా (2)
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేను నీ ప్రేమను (2)
||యేసయ్యా||
జలములు నన్ను చుట్టిననూ - నీ చేతిలో నను దాచినావయ్యా
జ్వాలలు నాపై లేచిననూ - నీ ఆత్మతో నను కప్పినావయ్యా (2)
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేను నీ ఆత్మను (2)
||యేసయ్యా||
