నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2)
||నీ కృప||
శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)
||నీ కృప||
ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే
ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
ప్రతికూలమైన పరిస్థితులన్నియు కనుమరుగైపోయెనే (2)
||నీ కృప||
అనుభవ అనురాగం కలకాలమున్నట్లే
నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు (2)
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2)
||నీ కృప||
