Evangelism

నీ జీవితం క్షణ భంగురం

Nee Jeevitham Kshana Bhanguram

Watch on YouTube
నీ జీవితం క్షణ భంగురం గమ్యంబులేని వేదనల వలయం (2) నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం (2) దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం ||నీ జీవితం|| ఏది సత్యం ఏది నిత్యం - ఏది మాన్యం ఏది శూన్యం సరి చూసుకో ఇప్పుడే - సరి చేసుకో (2) ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలో గమనించుమా ప్రియ నేస్తమా (2) ||నీ జీవితం|| కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనా నీ సర్వ భారమంతా - యేసు పైన వేయుమా (2) నీ హృదయ భారం తీరును ఈ క్షణం దిగులు పడకుమా ప్రియ నేస్తమా (2) ||నీ జీవితం||