Dedication

నావన్ని యంగీకరించుమీ దేవా

Naavanni Yangeekarinchumi Devaa

Watch on YouTube
నావన్ని యంగీకరించుమీ దేవా - నన్నెప్పుడు నీవు కరుణించుమీ నావన్ని కృపచేత నీవలన నొందిన (2) భావంబునను నేను బహుదైర్యమొందెద ||నావన్ని|| నీకు నా ప్రాణము నిజముగా నర్పించి (2) నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని|| సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని (2) నిత్యంబు గరముల నీ సేవ జేసెద ||నావన్ని|| నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు (2) ఆశచే నడిపించు మరల నా పదములు ||నావన్ని|| పెదవులతో నేను బెంపుగ నీ వార్త (2) గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి ||నావన్ని|| నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ (2) యావంత యైనను నాశింప మదిలోన ||నావన్ని|| నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే (2) సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు ||నావన్ని|| చిత్తము నీ కృపా యత్తంబు గావించి (2) మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము ||నావన్ని|| హృదయంబు నీకిత్తు సదనంబు గావించి (2) పదిలంబుగా దాని బట్టి కాపాడుము ||నావన్ని||