నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని
నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని
దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని
దేవా... యేసయ్యా నిన్ను చేరాలని
జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ
జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2)
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్
శ్రమలు నన్ను తరిమినా - విడువలేదు నీ కృప
వేదనలో నేను కృంగినా - లేవనెత్తెను నీ చేయి (2)
ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా
తరతరాలు మారినా మారని దేవుడా
||జీసస్||
విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా
మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2)
తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద
నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును
||జీసస్||
