Devotional

నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు

Naa Naathudaa Naa Yullamichchithi Neeku

Watch on YouTube
నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2) అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2) పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్ ||నా నాథుడా|| దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2) యావత్తు పెంటయనుచు (2) నిదిగో ||నా నాథుడా|| ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2) ఆశ కల్గించు నాలోన (2) నీవే ||నా నాథుడా|| పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2) కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు ||నా నాథుడా|| భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి (2) పాతకుడ నేనైతిని (2) మహా ||నా నాథుడా|| ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ (2) సదయుడా నన్ను చూడుమా (2) యిపుడు ||నా నాథుడా|| హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను (2) ఉల్లమందానంద ధ్వని (2) యిదియే ||నా నాథుడా||