Praise
మహిమ నీకే ఘనత నీకే - నీతి సూర్యుడా
Mahima Neeke Ghanatha Neeke - Neethi Sooryudaa
మహిమ నీకే ఘనత నీకే - నీతి సూర్యుడా (2)
న్యాయాధిపతియైన నా యేసయ్యా - నీకే ఆరాధన (2)
ధనవంతులను అణచేవాడవు
జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2)
దరిద్రులను లేవనెత్తువాడవు - నీవే రాజువు (2)
యుద్ధవీరుడా శూరుడా
లోకాన్ని గెలిచిన యేసయ్యా (2)
మార్గమే తెలియని అబ్రహామును - అనేకులకు తండ్రిగా చేసినావు
నెట్టివేయబడిన యోసేపుచే - అనేకులను కాపాడినావు
||దరిద్రులను||
గొఱ్ఱెలకాపరియైన దావీదును - అనేకులకు రాజుగా చేసినావు
నోటి మాంద్యముగల మోషేచే - అనేకులను నడిపించినావు
||దరిద్రులను||
