Repentance

మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి

Maargamu Choopumu Intiki Naa Thandri Intiki

Watch on YouTube
మార్గము చూపుము ఇంటికి - నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమా ప్రపంచమో - చూపించు కంటికి (2) పాప మమతల చేత - పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము పశ్చాత్తాప్పమునొంది - తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము (2) ప్రభు నీదు సిలువ - ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము (2) ||మార్గము|| ధనమే సర్వంబనుచు - సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల - బ్రతుకు ధ్వంసము జేయ దేహీ నిను చేరితి (2) దేహీ అని నీ వైపు - చేతులెత్తిన నాకు దారిని జూపుము (2) ||మార్గము|| దూర దేశములోన - బాగుందుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను - నమ్మిన హితులెల్ల తరిమే దారిద్య్రము (2) దాక్షిణ్య మూర్తి నీ - దయ నాపై కురిపించి ధన్యుని చేయుము (2) ||మార్గము|| అమ్ముకొంటిని నేను - అధముడొకనికి నాడు ఆకలి బాధలో అన్యాయమయిపోయే - పందులు సహ వెలివేయ అలవడెను వేదన (2) అడుగంటె అవినీతి - మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము (2) ||మార్గము|| కొడుకునే కాదనుచు - గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి కూలివానిగనైన - నీ యింట పని చేసి కనికరమే కోరుదు (2) కాదనకు నా తండ్రి - దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము (2) ||మార్గము|| నా తండ్రి నను జూచి - పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను నవ జీవమును గూర్చి - ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను (2) నా జీవిత కథయంత - యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును (2) ||మార్గము||