Worship

మార్గం సత్యం జీవం నీవే యేసు

Maargam Sathyam Jeevam Neeve Yesu

Watch on YouTube
మార్గం సత్యం జీవం నీవే యేసు సర్వం సకలం నీవే క్రీస్తు (2) మా ఆధారం నీవేనయ్యా మా అనుబంధం నీతోనేనయ్యా (2) వధియింపబడిన ఓ గొర్రెపిల్ల ప్రభువైన మా యేసువా మా స్తుతి స్తోత్రముల్ నీకే మహిమా ప్రభావముల్ నీకే (2) ||మార్గం|| పరమును విడిచావు మాకై నరునిగా పుట్టావు ధరపై (2) ఆహా నీదెంత ప్రేమ ఎవరికైనా వర్ణింప తరమా (2) ||వధియింప|| కలువరిలో రక్తమును కార్చి విలువగు ప్రాణమును ఇచ్చి (2) తెచ్చావు భువికి రక్షణ ఇచ్చావు పాప క్షమాపణ (2) ||వధియింప||