మా ఊహలు పుట్టక మునుపే - మా సర్వమునెరిగిన దేవా (2)
ఇహపరములలో నీవే - మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2)
విశ్వాస నిరీక్షణతో - కనిపెట్టియున్నచో (2)
పొందెదము ఎన్నో మేలులూ - ప్రభువా నీ పాద సన్నిధిలో (2)
||మా ఊహలు||
నిన్నడుగకుండగనే - మోషేను పిలచితివి
నిన్నడిగిన సొలోమోనుకు - జ్ఞాన సిరుల నొసగిన దేవా (2)
పలు సమయముల యందు - పలు వరముల నిచ్చితివి (2)
అడుగనేల ప్రభువా ఈ ధరలో - నీ దివ్య కృపయే చాలు
||మా ఊహలు||
ప్రార్ధించుచుంటిమి - సమస్యలు తీర్చమని
నిన్నడుగుచున్నాము నీ - రాజ్యములో చోటిమ్మని (2)
ఊహించు వాటికంటె - అధికముగా నిచ్చెడి దేవా (2)
ఇంతకంటె మాకేమి వలదు - నీ తోడు నీడే చాలు
||మా ఊహలు||
