Worship

మా గొప్ప దేవా మము కరుణించి

Maa Goppa Devaa Mamu Karuninchi

Watch on YouTube
మా గొప్ప దేవా - మము కరుణించి అత్యున్నత స్థానములో నను నిలిపావు యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెల కట్టలేను ఆ ప్రేమకు ఆరాధించెదను... నా పూర్ణ హృదయముతో నిన్నే కీర్తింతును - నా జీవితమంతా (2) నెమ్మదే లేని బ్రతుకులో - పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2) పాపంలో నుండి నను విమోచించుటకు ఆ ఘోర సిలువలోన మరణించావు దాస్యములోనుండి పడి ఉన్న నన్ను నీ కుమారునిగా రక్షించావు ||మా గొప్ప|| మార్పులేని బ్రతుకులో మలినమైన మనస్సుతో నే తూలనాడి దూషించింది నిన్నేనేగా (2) ఆ స్థితిలో కూడా నను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమియించి ప్రేమించింది నీవేనయ్యా ||మా గొప్ప||