Worship

కలుగును గాక దేవునికి మహిమ

Kalugunu Gaaka Devuniki Mahima

Watch on YouTube
కలుగును గాక - దేవునికి మహిమ - కలుగును గాక కలుగు నున్నతమైన - ఘన స్థలములందున నిలకు సమాధానం - నరుల కాయన దయ ||కలుగును|| ప్రభువైన దేవా - పరమరాజా - సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల- పరమ జనక నిన్ను మహిమ స్తుతించుచు - మరి పొగడుచున్నాము ||కలుగును|| మహిమపర్చుచు - ఆరాధించు - చున్నాము నిన్ను మహిమాతిశయమును - మది దలంచియు నీకు మహిని మా స్తుతి కృత - జ్ఞత నిచ్చు చున్నాము ||కలుగును|| ఏక కుమారా - యేసు ప్రభువా - యెహోవా తనయా లోక పాపము మోయు - ఏక దేవుని గొఱ్రె పిల్ల మమ్మును కనిన - రించుము చల్లగ ||కలుగును|| పరిశుద్ధుడవు - ప్రభుడవు నీవో - ప్రభువైన క్రీస్తూ పరిశుద్ధాత్మతో తండ్రి - యైన దేవునియందు బరిపూర్ణ మహిమతో - బ్రబలుచున్నామామేన్ ||కలుగును||