Prayer

ఇకనైన కానీ ఇప్పుడైన కానీ దర్శించగా రావా

Ikanaina Kaani Ippudaina Kaani Darshinchaga Raavaa

Watch on YouTube
ఇకనైన కానీ ఇప్పుడైన కానీ దర్శించగా రావా అభిషేకం లేక దర్శనము రాక నశియించుచున్నానయ్యా (2) కావలివాడు ఉదయం కోసం మెలుకువ కలిగి చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) ఎండిన నేల వర్షం కోసం నేలను విరచి చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) దుప్పి నీటి వాగుల కొరకు ఇలలో ఎదురు చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4)