Praise

హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం

Hosannanuchoo Sthuthi Paaduchoo Seeyonuku Cheredam

Watch on YouTube
హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2) హోసన్నా... హోసన్నా... (4) ||హోసన్ననుచూ|| ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం (2) క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం (2) ||హోసన్నా|| మన్నయిన ఈ దేహం మహిమరూపమై ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2) నాధుడేసుకు నవ వధువులము నీతి పాలనలోన యువరాణులము (2) ||హోసన్నా|| ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును చింతలన్ని తీర్చి చెంత నిలుచును (2) ఆకలి లేదు దప్పిక లేదు ఆహా మన యేసుతో నిత్యమానందం (2) ||హోసన్నా||