ద్రాక్షావల్లివి నీవైతే
తీగెగ నేను ఎదిగితిని (2)
తండ్రి తోటలో నే నాటబడితి
ఎంత ధన్యత ఈ మహిలో - (2)
||ద్రాక్షా||
చల్ల గాలులు వీచగా
కాంతి కిరణాలు ప్రసరించగా (2)
నీతి సూర్యుని నిజ కాంతిలోన
తేజరిల్లెడి బ్రతుకు తోడ
రక్షణ తోటలో విరివిగ పెరిగి
నీటి యోరన నిలిచితిని - (2)
||ద్రాక్షా||
కొమ్మ కొమ్మను చూడగా
తీగలెన్నో అగుపించెనే (2)
ఆకు మాటున తీగె గావున
మొలవనున్నవి ఫలములెన్నో
నిలిచె అందులో ఫలితము కొరకై
కలిగె స్నేహము యేసునితో - (2)
||ద్రాక్షా||
