Praise
ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము
Dhanyamu Entho Dhanyamu Yesayyanu Kaligina Jeevithamu
ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము (2)
ఇహమందున పరమందున నూరు రెట్లు ఫలముండును (2)
వారె ధన్యులు వారెంతో ధన్యులు (2)
||ధన్యము||
ఎవరి అతిక్రమములు పరిహరింపబడెనో (2)
ఎవరి పాపములు మన్నించబడెనో (2)
||వారె ధన్యులు||
క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు (2)
క్రీస్తుయేసు స్వరము విను వీనులే వీనులు (2)
||వారె ధన్యులు||
ప్రభు యేసుని సేవచేయు పాదములే సుందరములు (2)
ప్రభుని గూర్చి పాటపాడు పెదవులే పెదవులు (2)
||వారె ధన్యులు||
ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును (2)
అపవాది తంత్రములు గుర్తించు వారును (2)
||వారె ధన్యులు||
శ్రమలయందు నిలచి పాడుచున్న వారును (2)
శత్రు బాణములెల్ల చెదరగొట్టు వారును (2)
||వారె ధన్యులు||
