Worship

దొరకును సమస్తము యేసు పాదాల చెంత

Dorukunu Samasthamu Yesu Paadaala Chentha

Watch on YouTube
దొరకును సమస్తము యేసు పాదాల చెంత వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2) యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా ||దొరకును|| మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2) పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు (2) చేసెను శ్రేష్టారాధన దొరికెను పాప క్షమాపణ (2) ||దొరకును|| యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2) చిన్నదాన లెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు (2) కలిగెను మహదానందం దొరికెను రక్షణ భాగ్యము (2) ||దొరకును|| పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి పాదాలపై పడెను పరవశుడై యుండెను (2) పరలోక దర్శనం చూచెను తానే స్వయముగా (2) దొరికెను ప్రభు ముఖ దర్శనం దొరికెను ఇల మహా భాగ్యం (2) ||దొరకును||