Good Friday

దైవ తనయా క్రీస్తు నాథుండా అయ్యా

Daiva Thanayaa Kreesthu Naathundaa Ayyaa

Watch on YouTube
దైవ తనయా క్రీస్తు నాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిను పంపినాడా ||దైవ|| పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా (2) ప్రాణదానము చేసినావా - దేవా పరలోకము తెరచినావా ||దేవుడే|| కల్వరిలో కార్చినట్టి దివ్యరక్తముచే మమ్ము (2) కడిగి పావన పరచినావా - దేవా కడుగు బూరతో రానై యున్నావా ||దేవుడే|| మరణము జయించినావా మరణముల్లు విరచినావా (2) మహిమతోడ లేచినావా - దేవా మాదు చింతలు దీర్చినావా ||దేవుడే|| ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి (2) ధరణికే ఏతెంచినావా - దేవా ధన్యులనుగా జేసినావా ||దేవుడే|| ఆదియంతము లేనివాడా అందరికిని దేవుడవు (2) అల్ఫయు ఓమేగయు నీవేగా - యేసు ఆర్భటించుచు రానై యున్నావా ||దేవుడే||