Praise

భీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటన్ గూడరే

Bheekarundau Maa Yehovaa Peetha Medutan Goodare

Watch on YouTube
భీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటన్ గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ|| మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే మెచ్చుగా మది నెంతుము ||భీకరుండౌ|| ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిన్ దానొక్కడే మా దైవమని పూజింతుము ||భీకరుండౌ|| పుట్టగిట్టన్ జేయ దానై నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్తులారా ప్రస్తుతింపరే భక్తిని ||భీకరుండౌ|| మేటి సంగీతంబులపై మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను ||భీకరుండౌ|| మిక్కిలి కష్టంబులతో మిత్తికిని బాల్పొందను దిక్కు లేని గొర్రెలట్లు దిరుగ జేర్పన్ మందను ||భీకరుండౌ||