Encouragement
భయము చెందకు భక్తుడా ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు
Bhayamu Chendaku Bhakthudaa Ee Maaya Loka Chaayalu Choochinappudu
భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)
భయము చెందకు నీవు
దిగులు చెందకు నీవు (2)
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు
||భయము||
బబులోను దేశమందున
ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందునా (2)
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా నాల్గవ వాడు ఉండలేదా
||భయము||
చెరసాలలో వేసినా
తన దేహమంతా గాయాలతో నిండినా (2)
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2)
భూకంపం కలుగ లేదా
ఆ భక్తులు ముగ్గురు చెరనుండి విడుదల కాలేదా
||భయము||
ఆస్తి అంతా పోయినా
తన దేహమంతా కురుపులతో నిండినా (2)
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2)
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా అని యోబు పలుక లేదా
||భయము||
