Worship
ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
Ae Yogyatha Leni Nannu Neevu Preminchinaavu Devaa
ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును
నీ ఋణమెలా తీర్తును (2)
||ఏ యోగ్యతా||
కలుషితుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు (2)
పావన దేహంలో గాయాలు పొంది (2)
రక్తమంత చిందించినావా
||నీకేమి||
సుందరమైన నీ రూపమును
మంటివాడనైన నాకీయుటకు (2)
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి (2)
నీ సొగసును కోల్పోయినావా
||నీకేమి||
పాపము వలన మృతినొందిన
అపరాధినైన నను లేపుటకు (2)
నా స్థానమందు నా శిక్ష భరించి (2)
మరణించి తిరిగి లేచావా
||నీకేమి||
