Christmas

యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో

Yesu Kreesthu Puttenu Nedu Pashuvula Paakalo

Watch on YouTube
యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2) ఇది పండుగ – క్రిస్మస్ పండుగ జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2) ||యేసు క్రీస్తు|| పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2) కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2) ||ఇది పండుగ|| సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2) నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2) ||ఇది పండుగ|| శరీర ధారిగా – కృపగల దేవునిగా (2) పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2) ||ఇది పండుగ||