వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)
ఎముకలలో ఒక ఎముకగా - దేహములో సగ భాగముగా (2)
నారిగా సహకారిగా - స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)
||వివాహమన్నది||
ఒంటరిగా ఉండరాదని - జంటగా ఉండ మేలని (2)
శిరస్సుగా నిలవాలని - పురుషుని నియమించినాడు దేవుడు (2)
||వివాహమన్నది||
దేవునికి అతిప్రియులుగా - ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని - ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)
||వివాహమన్నది||
