విలువైన నీ కృప నాపై చూపి - కాచావు గత కాలము
ఎనలేని నీ కృప నాపై ఉంచి - ఇచ్చావు ఈ వత్సరం
దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో
ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో
నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2)
||విలువైన||
గడచినా కాలమంతా తోడైయున్నావు
అద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2)
లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు (2)
నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2)
||నా జీవిత||
సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా
నూతన కార్యాలు ఎన్నో చేశావు (2)
సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు (2)
నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు
మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు
||నా జీవిత||
