వేటగాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకాశ్రయమిచ్చావు (2)
లేదు లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా కేడేమా
లేదు లేదయ్యా వేరే ఆధారం
నా శృంగమా నా శైలమా
ఆరాధన ఆరాధన - నా తండ్రి నీకే ఆరాధన (2)
రాత్రివేళ భయమైన
పగటివేళ బాణమైన
రోగం నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2)
||ఆరాధన||
వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు
నా గుడారము సమీపించదు (2)
||ఆరాధన||
మార్గంలో కాపాడుటకు
నీ దూతలను ఏర్పరిచావు
రాయి తగలకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2)
||ఆరాధన||
