వేసారిన మనసే ఊగెనే
చేజారిన స్ధితికి చేరెనే
యే గాయమైన మానదే
నాకున్న బలము చాలదే (2)
వినిపించు యేసు నీ స్వరం
నడిపించు నీతో అనుక్షణం
||వేసారిన||
కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే
తాళలేను లేసమైన నీ కోపమే
భారము మోపకే లోపమూ చూడకే
ఎన్నడు నీ కృప దూరము చేయకే
||వేసారిన||
వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే
వీడిపోదు ఆదరించే నీ స్నేహమే
తోడుగా ఉండునే - త్రోవను చూపునే
చేకటి కమ్మినా క్షేమము పంపునే
||వేసారిన||
