వాక్యమే శరీర ధారియై వసించెను
జీవమై శరీరులను వెలిగింపను
ఆ… ఆ…. ఆ… ఆ…. (2)
కృపయు సత్యములు - హల్లెలూయ
నీతి నిమ్మళము - హల్లెలూయ (2)
కలసి మెలసి - భువిలో దివిలో (2)
ఇలలో సత్యము మొలకై నిలచెను
||వాక్యమే||
ఆశ్చర్యకరుడు - హల్లెలూయ
ఆలోచనకర్త - హల్లెలూయ (2)
నిత్యుడైన - తండ్రి దేవుడు (2)
నీతి సూర్యుడు - భువినుదయించెను
||వాక్యమే||
పరమ దేవుండే - హల్లెలూయ
నరులలో నరుడై - హల్లెలూయ (2)
కరము చాచి - కనికరించి (2)
మరు జన్మములో మనుజుల మలచే
||వాక్యమే||
