Prayer
ఉపవాసంతో ప్రార్ధనలో నీ వైపే చూస్తున్నా దేవా
Upavaasanto Praardhanalo Nee Vaipe Choostunnaa Devaa
ఉపవాసంతో ప్రార్ధనలో
నీ వైపే చూస్తున్నా దేవా
మోకాళ్లపై కన్నీటితో
నే చేయు ప్రార్ధన వినుము దేవా
అడిగిననూ ఇయ్యవా దేవా
వెదకిననూ దొరకవా దేవా
తట్టిననూ తీయవా దేవా
యేసయ్యా విను నా ప్రార్ధన
||ఉపవాసంతో||
నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యా
నా యొక్క తలంపులన్ని నీవవ్వాలయ్య (2)
దీపముగా మారి వెలుగును ఇవ్వాలయ్యా (2)
రుచికరంగా నీ ఉప్పుగా ఉండాలయ్యా (2)
||అడిగిననూ||
జీవించు కాలమంతా నీ సేవ చేయాలి
నీ యొక్క సువాసన నేనివ్వాలయ్యా (2)
నేటి యువతకు ఆదర్శంగా ఉండాలయ్యా (2)
రేపటి సంఘానికి నీ మార్గం చూపాలయ్యా (2)
||అడిగిననూ||
