త్రాహిమాం క్రీస్తు నాథ - దయ జూడ రావే
నేను - దేహి యనుచు నీ పాదములే
దిక్కుగా జేరితి నిపుడు
||త్రాహిమాం||
గవ్వ చేయరాని చెడ్డ - కర్మేంద్రియాధీనుడనై
రవ్వ పాలై నేనెంతో - నెవ్వ బొందితి
త్రవ్వుచున్న కొలది - పెరుగు - దరగదు నా పాప రాశి
యివ్విధమున జెడిపోతిని నే - నేమి సేతు నోహోహోహో
||త్రాహిమాం||
నీ యందు భయభక్తులు లేని - నిర్లజ్జా చిత్తము బూని
చేయరాని దుష్కర్మములు - చేసినాడను
దయ్యాల రాజు చేతిలో - జేయి వేసి వాని పనుల
జేయ సాగి నే నిబ్భంగి - జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో
||త్రాహిమాం||
నిబ్బర మొక్కించుకైన - నిజము రవ్వంతైన లేక
దబ్బర లాడుతకు ము - త్తా నైతిని
అబ్బురమైన ఘోర పా - పాంధకార కూపమందు
దబ్బున బడిపోతి నయ్యో - దారి చెడి నేనబ్బబ్బబ్బా
||త్రాహిమాం||
నిన్ను జేరి సాటిలేని - నిత్యానంద మంద బోవు
చున్నప్పుడు నిందలు నా - కెన్ని చేరినా
విన్నదనము లేకుండ నీ - వే నా మదికి ధైర్యమిచ్చి
యన్నిట రక్షించితివి నా - యన్న నీకు స్తోత్ర మహాహా
||త్రాహిమాం||
