Blessing

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన

Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

Watch on YouTube
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును (2) ||తొలకరి|| ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును (2) ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2) ||అది నూతన|| సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2) యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2) ||అది నూతన||