Dedication

తనువు నా దిదిగో గై కొనుమీ

Thanuvu Naa Didigo Gai Konumee

Watch on YouTube
తనువు నా దిదిగో గై - కొనుమీ యో ప్రభువా నీ - పనికి బ్రతిష్టించుమీ దినములు క్షణములు - దీసికొని యవి నీదు వినతిన్ ప్రవహింప జే - యను శక్తి నీయుమీ ||తనువు|| ఘనమైన నీ ప్రేమ - కారణంబున నీకై - పని చేయ జేతు లివిగో యనయంబు నీ విషయ - మై సొగసుగా జురుకు దనముతో పరుగెత్త - వినయ పాదము లివిగో ||తనువు|| స్వర మిదిగో కొనుమీ - వరరాజ నిను గూర్చి - నిరతమ్ము పాడనిమ్ము మరియు పెదవు లివిగో - మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో - పరి పూర్ణముగా నింపు ||తనువు|| వెండి పసిడి యివిగో - వీస మైనను నాకై - యుండవలె నని కోరను నిండైన నీ యిష్ట - నియమంబు చొప్పున మెండుగా వాడ పరి - మితియవు జ్ఞానం బిదిగో ||తనువు|| నా యిష్ట మిదిగో యిది - నీ యిషముగ జేయ - నా యిష్ట మిక గాదది నా యిఛ్చ యున్నట్టి - నా హృదయ మిదిగో నీ కే యియ్యది రాజ - కీయ సింహాసనామౌ ||తనువు|| ఉన్న నా ప్రేమ నీ - సన్నిధానమున నే - నెన్నడు ధార వోయన్ నన్ను నీ వానిగ - నాథా గైకొను మెపుడు చెన్నుగ నీ వశమై - స్థిర ముగ నుండెద ||తనువు||