తలవంచకు నేస్తమా (2)
తలవంచకు ఎప్పుడూ
తలవంచకు ఎన్నడూ
స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో
కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో
కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో
ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో
నీవు కావాలి ఓ.. మాదిరి
నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ
నీవు మండాలి ఓ.. జ్వాలగా
నీవు చేరాలి ఓ.. గమ్యము
||తలవంచకు||
చీకటిని వెనుకకు త్రోసి - సాగిపో ముందుకే
క్రీస్తు బాటలో పయనిస్తే - ఎదురేమున్నది
రేపటి భయం నిందల భారం - ఇకపై లేవులే
క్రీస్తుని చేరు లోకాన్ని వీడు - విజయం నీదేలే (2)
||నీవు||
పెకిలించు కొండలను - విశ్వాస బాటలో
గెలవాలి యుద్ధ రంగంలో - దైవిక బలంతో
యేసుని కృప నీతోనే ఉంది - సాధించు ప్రగతిని
మంచిని పెంచు ప్రేమను పంచు - నిలిచిపో జగతిలో (2)
||నీవు||
