Faith

సుదూరము ఈ పయనము

Sudhooramu Ee Payanamu

Watch on YouTube
సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే... యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే... ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా... నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||