Praise
స్తుతించి పాడెదం - స్తుతుల స్తోత్రార్హుడా
Sthuthinchi Paadedam - Sthuthula Sthothraarhudaa
స్తుతించి పాడెదం - స్తుతుల స్తోత్రార్హుడా
ఉత్సాహించి పాడెదం - ఉదయ సాయంత్రముల్
స్తుతుల సింహాసనం మీదాసీనుడా
మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2)
||స్తుతించి||
గతకాలమంతా నీవు - మము కాచి కాపాడావు
వ్యధలన్ని తీసావు (2)
గతి లేని మాపై నీవు
మితిలేని ప్రేమ చూపి (2)
శత సంఖ్యగా మమ్ము దీవించావు
||స్తుతించి||
కరుణా కటాక్షములను కిరీటములగాను
ఉంచావు మా తలపై (2)
పక్షి రాజు యవ్వనమువలె
మా యవ్వనమునంతా (2)
ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు
||స్తుతించి||
