Praise

స్తుతి గానమే పాడనా

Sthuthi Gaaname Paadanaa

Watch on YouTube
స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా (2) నా ఆధారమైయున్న యేసయ్యా నీకు - కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి|| నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే - ఎంతో కోరతగినవి (2) నీ ధర్మాసనము - నా హృదయములో స్థాపించబడియున్నది - పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి|| శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే - ఎంతో ఉపయుక్తమైనవి (2) నీ శ్రేష్టమైన - పరిచర్యలకై కృపావరములతో నను - అలంకరించితివే (2) ||స్తుతి|| నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే - ఎంతో ఆశించదగినది (2) నీ సింహాసనము - నను చేర్చుటకై నాతో నీవుంటివే - నా గురి నీవైతివే (2) ||స్తుతి||