శ్రమయైనా బాధైనా - హింసలెన్ని ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
ఖడ్గమే ఎదురైనా - శోధనలు ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
నా రాజు వచ్చుచున్నాడు - భీకరుడై వచ్చుచున్నాడు (2)
సర్వోన్నతుడు మేఘారూఢిగా - తీర్పును తీర్చ రానున్నాడు
ఎదురేలేని కొదమసింహం - మహా ఉగ్రతతో రానున్నాడు
ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు
యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు - సర్వము చేసిన సృష్టికర్త
మహోన్నతుడు మహేశ్వరుడు - సర్వము గెలిచిన సర్వేశ్వరుడు
దేవాది దేవుడు రాజాధి రాజు - ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు
విశ్వాసమే నా బలము - నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము
శ్రమలేలేని బాధేలేని - ఆ లోకంలో నిరంతరం జీవింతును
విమోచకుడు సజీవుడు - నా కనులారా నే చూచెదను
యుగయుగములకు మహారాజునితో - పాలించుటకే పోరాడెదను
ఓ క్రైస్తవా సోలిపోకుమా - తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో
మోసపోకుమా జారిపోకుమా - నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో
మంచి పోరాటం నువ్వు పోరాడు - నీ పరుగునే కడముట్టించు
విశ్వాసమును కాపాడుము - యేసుని చేర వెయ్యి ముందడుగు
||శ్రమయైనా||
