సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో (2)
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున (2)
మనకై జన్మించినాడు
మనలను రక్షించినాడు (2)
||సూడ||
బేత్లెహేము పురమందున - లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై - మనకు కాపరిగా నిలిచెను (2)
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2)
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను (2)
||సూడ||
మన చీకటిని తొలగించి - వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి - పవిత్రులుగా మార్చెను (2)
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు (2)
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను (2)
||సూడ||
