శరణం శరణం శరణం దేవా - కరుణ నాథుడా (2)
కరుణ నాథుడా - ఈ తరుణమే ప్రభో (2)
||శరణం||
పాపరహిత దేవకుమారా - శాపవాహకా (2)
శాపవాహకా - నిత్య కోప రహితుడా (2)
||శరణం||
పరిపూర్ణ దేవుడా - నరావతారుడా (2)
నరావతారుడా - మా యేసు నాథుడా (2)
||శరణం||
దయామయుండ క్రీస్తు యేసు - దాక్షిణ్య ప్రభువా (2)
దాక్షిణ్య ప్రభువా - బాహుళ్య దేవుడా (2)
||శరణం||
నమ్మదగిన లోకరక్షకా - సర్వోపకారుడా (2)
సర్వోపకారుడా - సర్వశక్తిమంతుడా (2)
||శరణం||
సాత్వికుండా - సర్వజనుల కాంక్షణీయుడా (2)
కాంక్షణీయుడా - వాత్సల్య దేవుడా (2)
||శరణం||
రిక్తుడై తగ్గించుకొనిన - వినయపూర్ణుడా (2)
వినయపూర్ణుడా - మముగాచు దేవుడా (2)
||శరణం||
సత్యవంతుడవు - మాదు నిత్యదేవుడా (2)
నిత్యదేవుడా - మా మంచి బోధకుడా (2)
||శరణం||
సర్వలోక సృష్టికర్త - సత్యదేవుడా (2)
సత్యదేవుడా - మా నిత్యజీవమా (2)
||శరణం||
ఎల్లరిలో శ్రేష్ఠుడా - మా వల్లభుండవు (2)
వల్లభుండవు హల్లెలూయ పాడెదం (2)
||శరణం||
