Worship

సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై

Seeyonulo Nundi Neevu Prakaashinchuchunnaavu Naapai

Watch on YouTube
సీయోనులో నుండి నీవు - ప్రకాశించుచున్నావు నాపై (2) సమాధానమై - సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2) నిర్దోషమైన మార్గములో - నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2) నీ సన్నిధిలో నను నిలిపి - ఉన్నత విజయమునిచ్చితివి (2) నీ ఆశలు నెరవేరుటకు - నీ చిత్తము జరిగించుటకు విడువవు నను యెడబాయవు నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో|| నాయందు దృష్టి నిలిపి - నీ స్నేహబంధముతో ఆకర్షించి (2) కృపావరములతో నను నింపి - సత్యసాక్షిగా మార్చితివి (2) నీ మనస్సును పొందుకొని - నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం నిను ఆరాధింతును అనుక్షణము ||సీయోనులో|| నీ దివ్యమైన మహిమను - పరలోకమందునే చూచెదను (2) నీ కౌగిలిలో చేర్చుకొని - ప్రతి భాష్పబిందువును తుడిచెదవు (2) నీ మాటల మకరందమును - మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను నేను మరువను ఎన్నడు విడువను ||సీయోనులో||