Christmas

సర్వోన్నత స్థలములలో సమాధానము

Sarvonnatha Sthalamulalo Samaadhanamu

Watch on YouTube
సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను (2) హల్లెలూయా అర్పణలు - ఉల్లముతో చెల్లింతుమ్ రాజాధి రాజునకు - హోసన్నా ప్రభువునకు (2) ||సర్వోన్నత|| పశువుల పాకలో మనకు శిశువు జన్మించె పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి (2) ఆశ్చర్యకరుడు - ఆలోచనకర్త (2) నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2) ||హల్లెలూయా|| మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2) మన దోషము బాప - మానవరూపమున (2) జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు (2) ||హల్లెలూయా||