సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు
అధిక ప్రేమామయుడు అద్వితీయుడేసు (2)
ఏదైనా సాధ్యమే.. యేసుకు
ఏదైనా సాధ్యమే.. ప్రభువుకు (2)
తన మాట చాలు రోగమైన గడగడలాడును
తన ఉనికి చాలు దయ్యమైన విలవిలలాడును (2)
తన స్పర్శ చాలు మరణమైన జీవమైపోవును
||ఏదైనా సాధ్యమే||
తన తోడు చాలు మారాయైన మధురముగా మారును
తన సైగ చాలు సంద్రమైనా సద్దణిగి పోవును (2)
తన సన్నిధి చాలు స్థితి ఏదైనా మారిపోవును
||ఏదైనా సాధ్యమే||
